జంతువులపై క్రూరత్వాన్ని విడనాడాలి: ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవంలో పిలుపు
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మంలో ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం సందర్భంగా జంతు ప్రేమికులు సభ నిర్వహించారు. స్వర్ణ నంది అవార్డు గ్రహీత మాచల శివశంకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జంతువుల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. క్రూరత్వాన్ని విడనాడి జంతువులపై ప్రేమ చూపాలని, శాకాహార ప్రాముఖ్యతను గుర్తించాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.