గుండె సమస్యతో మళ్లీ ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయకుడు లయనెల్ రిచీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: World

ప్రముఖ గాయకుడు లయనెల్ రిచీ గుండె సంబంధిత సమస్య కారణంగా మరోసారి ఆసుపత్రిలో చేరారు. అట్రియల్ ఫిబ్రిలేషన్ అనే గుండె స్పందన సమస్యతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఆరోగ్య సమస్య కారణంగా ఆయన తన సింగ్ ఏ సాంగ్ ఆల్ నైట్ లాంగ్ టూర్ లో భాగంగా జరగాల్సిన మూడు సంగీత ప్రదర్శనలను రద్దు చేసుకున్నారు. గత మూడు నెలల్లో లయనెల్ రిచీ ఆసుపత్రిలో చేరడం ఇది మూడోసారి కావడం గమనార్హం.