పేద క్రీడాకారుల కష్టాలపై ఫేక్ ప్రచారాలు ఆపాలి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Andhra Pradesh

క్రీడల్లో రాణించి ఎన్నో ఏళ్లుగా కష్టపడి సాధించుకున్న ఉద్యోగాలను ఫేక్ అని ప్రచారం చేయడానికి జగన్‌కు ఏ హక్కు ఉందని ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడ్డారు. కేవలం రూ. వెయ్యి స్కాలర్‌షిప్‌తో కష్టపడి పైకి వచ్చి ఉద్యోగాలు సాధిస్తే, పేదవాళ్ల జీవితాలతో ఆడుకుంటూ ఫేక్ ప్రచారాలు చేయడం సరికాదని హెచ్చరించారు. వేల కోట్లు ఆక్రమంగా సంపాదించిన వారికి పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని నిలదీస్తూ, ఈ దుష్ప్రచారాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.