విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రిపోర్టర్: సురేష్ స్థలం: విజయవాడ

విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉన్నతస్థాయి అధికారులను దర్యాప్తులో చేర్చకపోవడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం హైకోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించడంతో పాటు అన్ని కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సీబీఐని ప్రతివాదిగా చేరుస్తూ, పూర్తి వివరాలను సీల్డ్‌ కవర్‌లో సెప్టెంబర్‌ 30 నాటికి సమర్పించాలని ఆదేశించింది.