యూనివర్సిటీల్లో బయోమెట్రిక్ ఫీజుల పేరుతో భారీ అవినీతి
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలోని యూనివర్సిటీల పరిధిలో బయోమెట్రిక్ హాజరు పేరుతో విద్యార్థుల నుంచి కోట్లాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. కాలేజీల్లో కనీస వసతులు లేకపోయినా, హాజరు లేకపోయినా పరీక్షలకు అనుమతిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ నిధుల వినియోగం, టెండర్ల ప్రక్రియపై పారదర్శకత లేదని, అన్ని వర్సిటీల్లో సమగ్ర విచారణ చేపట్టాలని సీజేఎస్ అధ్యక్షుడు డా. మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు.