పాత ఓటర్లకు భారీ ఊరటనిచ్చిన ఈసీ: ఫారం-6తో మళ్లీ నమోదుకు అనుమతి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
ఓటర్ల జాబితాలో పేరు కోల్పోయిన పాత ఓటర్లు తిరిగి నమోదు కోసం ఫారం-6 సమర్పించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి కేసులు నమోదు కావని ఈసీ భరోసా ఇచ్చింది. అర్హులైన ఏ ఒక్క పౌరుడూ ఓటు హక్కును కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.