తులాభారం సినిమా లాంఛింగ్: క్రైమ్ మహారాజాగా రవితేజ కొత్త అవతారం

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో తులాభారం సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగినట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ పూర్తి భిన్నమైన క్రైమ్ మహారాజా అవతారంలో కనిపించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీవిష్ణు, దర్శకులు శివ నిర్వాణ, బాబీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.