ఓటర్ల సవరణ అక్రమాలపై చలో లోక్ భవన్: కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో లోక్ భవన్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.