నెల్లూరులో ఘనంగా గురుపూజోత్సవం: ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నెల్లూరు

నెల్లూరు కలెక్టరేట్‌లో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులర్పించారు. ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తును నిర్మించే శిల్పులని కలెక్టర్ కొనియాడారు. సాంకేతికత పెరిగినా ఉపాధ్యాయుడి స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని, రాష్ట్ర విద్యాశాఖను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పేర్కొన్నారు.