చెరువు షట్టర్లు పట్టించుకోని అధికారులు: నీరు వృథాగా పోతుందంటూ రైతుల ఆవేదన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: చుంచుపల్లి
చుంచుపల్లి మండలంలో రాంపురం పెద్ద చెరువు తూము షట్టర్లు మరమ్మతులు చేయకపోవడంతో విలువైన నీరు వృథాగా పోతోందని స్థానిక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ మరియు సింగరేణి అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని, అధికారుల నిర్లక్ష్యంతో రానున్న యాసంగి సాగుకు తీవ్ర నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వారు వాపోయారు. తక్షణమే స్పందించి తూముకు మరమ్మతులు చేపట్టాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు.