'రోడ్డు దాటుతుండగా ప్రమాదం': శ్రీదేవి దుర్మరణం

రిపోర్టర్: హరి స్థలం: తిరుపతి

తిరుపతి జిల్లా రాపూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీదేవి అనే మహిళ దుర్మరణం చెందారు. రాపూరులోని తూర్పు అగర్త కట్ట ప్రాంతానికి చెందిన శ్రీదేవి, రాపూరు ఫైర్ స్టేషన్ వద్ద హైవే రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఆమెను తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.