బాలీవుడ్ లో కొత్త సంచలనం: కార్తీక్ ఆర్యన్ లడాకూ ప్రకటన

రిపోర్టర్: కృష్ణ స్థలం: ముంబై

బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్, ప్రముఖ డైరెక్టర్ కబీర్ ఖాన్ కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతోందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ‘లడాకూ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో కార్తీక్ ఆర్యన్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా తొలి అడుగు వేస్తున్నట్లు తెలిపారు. నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్ను 2027 జూన్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.