కెనడాలో కాల్పులు, బెదిరింపులకు పాల్పడిన 15 మంది ఫోటోలు విడుదల

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: World

కెనడాలోని కల్గరీలో దక్షిణాసియా కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, కాల్పులకు పాల్పడుతున్న 15 మంది అనుమానితుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వీరంతా పంజాబ్ నుంచి స్టూడెంట్ వీసాలపై వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ముఠా వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కెనడా పోలీసులు వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.