జన్వాడ ఫామ్‌హౌజ్ భూములతో కేటీఆర్‌కు సంబంధం లేదు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: గండిపేట
జన్వాడ ఫామ్‌హౌజ్ భూములు తన సొంతమని, వాటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఫామ్‌హౌజ్ యజమాని ప్రదీప్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ తన చిన్ననాటి స్నేహితుడని, ఆ ఫామ్‌హౌజ్‌ను తాను కేటీఆర్‌కు లీజ్‌కు మాత్రమే ఇచ్చానని తెలిపారు. రాజకీయ పార్టీల నేతలు వ్యక్తిగత ఆస్తిని పరిశీలిస్తామంటూ వివాదం చేయడం సరికాదని, అధికారులకు ఏవైనా అనుమానాలు ఉంటే నోటీసులు ఇస్తే చట్టపరమైన పత్రాలు సమర్పిస్తానని ఆయన పేర్కొన్నారు.