సూళ్లూరుపేట నాయుడుపేటల్లో రూ 41 కోట్ల అభివృద్ధి పనులు

రిపోర్టర్: మహేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల పరిధిలో రూ.41 కోట్ల భారీ నిధులతో వివిధ అభివృద్ధి పనులకు డాక్టర్ నెలావల విజయశ్రీ శ్రీకారం చుట్టారు. ఈ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టడం జరిగిందని, త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.