టెట్ ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ ప్రారంభం
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో టెట్ 2026 ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారు.