కిర్గిస్థాన్ దేశంలోని ఇస్సిక్ కుల్ సరస్సులో ప్రాచీన నగర అవశేషాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కిర్గిస్థాన్
కిర్గిస్థాన్ దేశంలోని ఇస్సిక్ కుల్ సరస్సు అడుగున ప్రాచీన సిల్క్ రోడ్డు కాలం నాటి పురాతన నగర అవశేషాలను రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు గుర్తించినట్లు ఎక్స్పెడిషన్ డైరెక్టర్ మాక్సిమ్ మెన్షికోవ్ వెల్లడించారు. ఈ చారిత్రక ప్రదేశంలో పురాతన భవనాలు, మసీదులు, సమాధులు అలాగే జంతువుల ఎముకలు లభ్యమయ్యాయని, దీనిని పాంపీ నగరంతో పోల్చవచ్చని నిపుణులు స్పష్టం చేశారు.