చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో శ్రీమలయప్పస్వామి దర్శనం

రిపోర్టర్: కిరణ్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. శ్రీకృష్ణుడి దివ్యరూపంలో దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకోవడం భక్తులకు ఎంతో భక్తి భావాన్ని కలిగించింది. ఈ వేడుకల్లో భక్తులు పెద్దఎత్తన పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందారు.