'పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటిన కర్నూలు పోలీసులు': మొత్తం 32 పతకాలు కైవసం

రిపోర్టర్: విజయ్ స్థలం: Kurnool

ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్ & డ్యూటీ మీట్‌లో కర్నూలు జిల్లా పోలీసు క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తం 32 పతకాలను సాధించి తమ సత్తా చాటారు. ఇందులో 7 బంగారు, 11 వెండి, 14 కాంస్య పతకాలను గెలుచుకుని జిల్లా పోలీసు శాఖకు పేరు తెచ్చారు.