నర్సంపేట మార్గంలో ఘోర ప్రమాదం: అగ్నికి ఆహుతైన బ్రెజ్జా కారు

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

వరంగల్ నుంచి నర్సంపేట వైపు వెళ్తున్న మారుతి బ్రెజ్జా కారులో కోనాయిమాకుల సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ ప్రశాంత్ అప్రమత్తమై వెంటనే కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఇంజిన్ లో తలెత్తిన సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమని గీసుగొండ పోలీసులు ప్రాథమికంగా గుర్తించి దర్యాప్తు జరుపుతున్నారు.