పర్యావరణ హితం కోసం ఉచిత మట్టి వినాయకుల పంపిణీ

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల కేంద్రంలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో హెల్పింగ్ హాండ్స్ సేవా ఫౌండేషన్ సేవాదళ్ చైర్మన్ వంగపల్లి అంజయ్య స్వామి మండల ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. గత పదిహేనేళ్లుగా ఈ సేవలను కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, స్థానికులు వంగపల్లి అంజయ్య స్వామి సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.