'పెళ్లి ఇంట విషాదం': రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
రిపోర్టర్: అశోక్
స్థలం: రంగారెడ్డి జిల్లా
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. కుమార్తెకు పెళ్లి కుదిరిన నేపథ్యంలో వివాహ సామాగ్రి కొనుగోలు చేయడానికి బైక్పై వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంగళవాయిద్యాలు మోగాల్సిన ఇంట్లో చావుడప్పు మోగడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.