బీజేపీ తొత్తుగా సీఎం విజయ్ వ్యవహరిస్తున్నారంటూ డీఎంకే ఫైర్

రిపోర్టర్: మహేష్ స్థలం: Chennai

చెన్నై విమానాశ్రయ ఆపరేటర్‌ను మార్చాలని కోరుతూ ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ రాయడంపై డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడలో పావుగా మారారని, బీజేపీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించేందుకు ముఖ్యమంత్రే స్వయంగా లేఖ రాయడం ఏమిటని ఆయన సూటిగా నిలదీశారు.