కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్పేట దర్గాలో ఘనంగా 253వ గంధ మహోత్సవం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఏఎస్పేట
ఏఎస్పేట మండలంలోని ప్రసిద్ధ ఖాజా నాయబ్ రసూల్, దొరసానమ్మ దర్గా 253వ గంధ మహోత్సవ వేడుకలు కోర్టు ఆదేశాలతో మంగళవారం రాత్రి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. అర్థరాత్రి 12 గంటలకు ఎస్.జి.ఎన్. హఫీజ్ పాషా, తెల్లవారుజామున 2 గంటలకు ఫయాజ్ అహ్మద్ గంధ కలశాలతో దర్గాకు చేరుకుని స్వామివారికి గంధాన్ని సమర్పించి భక్తులకు పంచిపెట్టారు. ఆత్మకూర్ డిఎస్పి, ఆర్డీవో పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.