చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్ ను ఆవిష్కరించిన శ్రీజ

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం

ఖమ్మం కలెక్టరేట్ లో ఈ నెల పన్నెండు నుంచి నిర్వహించనున్న చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్ ను అదనపు కలెక్టర్ శ్రీజ బుధవారం ఆవిష్కరించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవీవీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమేష్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.