వైద్య నిపుణుల కోసం బిట్స్ పి అపోలో నాలెడ్జ్ భాగస్వామ్యం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

వైద్య రంగ నిపుణుల కోసం ప్రత్యేక వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్లను అభివృద్ధి చేయడానికి బిట్స్ పి సంస్థ అపోలో నాలెడ్జ్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రొఫెసర్ వి. రామగోపాల్ రావు వెల్లడించారు. ఈ మేరకు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ప్రీతా రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉద్యోగం చేస్తూనే వైద్యులు, నర్సులు అర్హతలు సాధించేలా ఈ నూతన కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు స్పష్టం చేశారు.