జన్నారంలో రేపు జరగనున్న భారీ కలప వేలం పాటకు రంగం సిద్ధం
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్ కేంద్రంలో బుధవారం ఉదయం పదిగంటల 30 నిమిషాలకు కలప వేలం పాట నిర్వహించనున్నట్లు ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. అవసరం ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టింబర్ డిపోలో టేకు నాన్ టేకు కలప అందుబాటులో ఉంది. దాదాపు 154 లాట్లు వేలానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.