విశాఖలో ప్రతి ఒక్కరికీ నీళ్లు ఇవ్వడానికి సిద్ధమన్న సీఎం చంద్రబాబు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Visakhapatnam
విశాఖపట్నంలో డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్, ఫార్మా, టూరిజం రంగాలు వచ్చినా, మరో వంద హోటల్స్ ఏర్పాటైనా ప్రతి ఒక్కరికీ తాగునీరు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీరు వస్తుందని, అప్పటికి 25 టీఎంసీల నీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు విశాఖ నీటి సరఫరా ప్రణాళికపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు.