టీటీడీ నెయ్యిలో జంతు కొవ్వు లేదన్న ఈడీ ప్రకటన సంచలనం
రిపోర్టర్: రాజేష్
స్థలం: తిరుపతి
టీటీడీ శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. సీబీఐ ఆధ్వర్యంలోని సిట్, ఈడీ దర్యాప్తులో జంతు కొవ్వు వినియోగించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని వెల్లడించింది. నెయ్యి కల్తీ వ్యవహారంపై ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనకు సంబంధించి కైలాశ్ చంద్ మంగ్లాను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది.