డైవర్షన్ రాజకీయాలు మాని పాలనపై దృష్టి పెట్టాలని బాల్క సుమన్ ఫైర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
కాంగ్రెస్ నాయకులు డైవర్షన్ రాజకీయాలు మాని ప్రజలకు ఇచ్చిన హామీలపై, పరిపాలనపై పూర్తి దృష్టి పెట్టాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. తక్షణమే పాలనపై శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు.