ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా తిరుపతి అభివృద్ధి: రూ.3,222 కోట్లతో పనులకు శ్రీకారం
రిపోర్టర్: వెంకట్
స్థలం: తిరుపతి
తిరుపతిని సకల సదుపాయాలతో ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం అమరావతి నుంచి వర్చువల్ విధానంలో రూ.3,222.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బృహత్తర అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. తిరుమల పవిత్రతను పరిరక్షించడంతో పాటు తితిదే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, భక్తులకు మెరుగైన వసతి, పార్కింగ్, అన్నప్రసాద సదుపాయాలను కల్పిస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.