కర్నూలు జిల్లా ఆలూరులో వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కర్నూలు
కర్నూలు జిల్లా ఆలూరులోని వెంకటలక్ష్మి వస్త్ర దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా పొగ వ్యాపించింది. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. షాపు యజమానులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.