ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణకు పోలీసుల మార్గదర్శకాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కల్లూరు

కల్లూరు పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో సోదరభావంతో నిర్వహించాలని ఏసీపీ వసుంధర యాదవ్ స్పష్టం చేశారు. సత్తుపల్లిలో ఉత్సవ మండపాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు కీలక నిబంధనలను వెల్లడించారు. మండపాలకు ముందస్తు రిజిస్ట్రేషన్, సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వాడాలని చెప్పారు. శోభాయాత్రలు, నిమజ్జనంలో పోలీసుల సూచనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టంగా హెచ్చరించారు.