పాలమూరులో పంటలను కాపాడాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

రిపోర్టర్: కిరణ్ స్థలం: Telangana

రాజకీయ ప్రయోజనాల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని, కన్నెపల్లి, నార్లాపూర్ పంపులు వెంటనే ఆన్ చేయాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్ణాటకతో మాట్లాడి పది టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి పాలమూరులో ఎండిపోతున్న పంటలను కాపాడాలని సూచించారు. తమపై ఎలాంటి విచారణలు లేదా చర్యలు తీసుకోవచ్చని, కానీ అన్నదాతలను మాత్రం ఆదుకోవాలని ఆయన ఘాటుగా హెచ్చరించారు.