డిసిసి అధ్యక్షురాలిని శాలువాతో సత్కరించిన రవాణా శాఖ మంత్రి పొన్నం
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలిగా ఇటీవల నియమితులైన పారిజాత నరసింహారెడ్డి సోమవారం హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొ ఆమెను శాలువాతో సత్కరించి, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.