మధుమేహ బాధితులకు హెచ్చరిక: కంటి చూపును దెబ్బతీస్తున్న డయాబెటిక్ రెటినోపతి ముప్పు

రిపోర్టర్: వెంకట్ స్థలం: New Delhi

మధుమేహం నియంత్రణలో లేకపోతే కంటి నరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, చూపు కోల్పోయే ప్రమాదం ఉందని మాక్స్ ఆసుపత్రి నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ అభిషేక్ దేవ్ హెచ్చరించారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే కంటిలోని రెటినా రక్తనాళాలు దెబ్బతింటాయని నిపుణులు తెలిపారు. లక్షణాలు కనిపించేసరికి రెటినాకు నష్టం జరుగుతుందని, భారత్ లో ఈ సమస్య పెరుగుతోందని ఐసీఎంఆర్ అధ్యయనాలు వెల్లడించాయి.