అగ్నిపథ్ పథకంలో భారీ మార్పులు: అగ్నివీరులకు మరో రెండేళ్ల సర్వీస్ పొడిగింపు

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

దేశ సైనిక బలగాల నియామకానికి సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్యం తెలిపారు. అగ్నిపథ్ పథకంలో సమూల మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన సవరణలకు ఆమోదం తెలిపిందన్నారు. నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత ఎంపిక కాని అగ్నివీరులకు అదనంగా మరో రెండేళ్లు సైన్యంలో సేవ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సవరించిన నిబంధనల ద్వారా యువ సైనికులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.