తీవ్ర అలర్ట్: బ్రెయిన్ స్ట్రోక్కు ముందు శరీరం ఇచ్చే హెచ్చరికలు ఇవే

రిపోర్టర్: సురేష్ స్థలం: బెంగళూరు

బ్రెయిన్ స్ట్రోక్ ముప్పునకు ముందు శరీరం పంపే ముందస్తు హెచ్చరికలను సకాలంలో గుర్తించాలని సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ నితిన్ కుమార్ స్పష్టం చేశారు. బెంగళూరు స్పర్ష్ హాస్పిటల్ వైద్యుల కథనం ప్రకారం, తీవ్రమైన తలనొప్పి, శరీరంలో ఒకవైపు తిమ్మిరి, మాట్లాడటంలో ఇబ్బంది, చూపు మసకబారడం, బ్యాలెన్స్ కోల్పోవడం వంటి లక్షణాలు స్ట్రోక్కు సంకేతాలని తెలిపారు. ఇలాంటి ముందస్తు సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణ వైద్య సహాయం తీసుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి రక్షించుకోవచ్చని ఆయన హెచ్చరించారు.