ఉద్యోగులకు కొత్త విధానం: ఇకపై సెలవులన్నీ ఇక ఆన్లైన్లోనేనని సర్కార్ వెల్లడి
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత పెంచే లక్ష్యంతో సరికొత్తగా ఈ-హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ సిస్టం విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇకపై గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉద్యోగుల సెలవులతో పాటు సర్వీస్ రిజిస్టర్ వివరాలన్నీ ఆన్ లైన్ లో నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని సుమారు ఐదు లక్షల మంది ఉద్యోగులకు ఈ నూతన విధానం వర్తించనుంది.