భారత మార్కెట్ లో యాపిల్ సరికొత్త రికార్డు: గరిష్ట ఆదాయం నమోదు
రిపోర్టర్: అశోక్
స్థలం: New Delhi
భారత మార్కెట్ లో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించిందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ జాన్ టెర్నస్ వెల్లడించారు. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ అత్యధిక రెవెన్యూ సాధించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఐఫోన్ల విక్రయాలతో పాటు మాక్ కంప్యూటర్లు, సర్వీసుల విభాగంలోనూ ఆల్ టైమ్ రికార్డులు నమోదయ్యాయని తెలిపారు. దేశవ్యాప్తంగా గతంతో పోలిస్తే ఎక్కువ మంది వినియోగదారులు తమ ఐఫోన్లను అప్గ్రేడ్ చేసుకున్నట్లు ఆయన వివరించారు.