గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తెలంగాణ కాంగ్రెస్ ఆరాటం
రిపోర్టర్: మహేష్
స్థలం: Hyderabad
గిగ్ వర్కర్ల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో గిగ్ వర్కర్ల న్యాయ అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు తెలంగాణ కాంగ్రెస్ వెల్లడించింది. జాతీయ యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ మణీష్ శర్మ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సభలో వర్కర్ల హక్కులు, భద్రతపై విస్తృతంగా చర్చించారు. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.