కుప్పంలో రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కుప్పం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు తన ప్రాతినిధ్య నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 289.5 కోట్ల వ్యూహాత్మక అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు, మరో రూ. 38.5 కోట్ల విలువైన కొత్త అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కొత్తపేటలో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.