రాష్ట్రంలో కరువు పరిస్థితులపై కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రమేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో వర్షపాత లోటు, కరువు పరిస్థితులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం నీటిని రాయలసీమకు మళ్లించడంలో కూటమి సర్కార్ విఫలమైందని ఆరోపించారు. రైతులకు అండగా నిలిచేందుకు మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యాచరణ చేపట్టి పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.