గుండెపోటు రాకుండా వర్కౌట్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్న డాక్టర్ శ్యామ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: బెంగళూరు

సడెన్‌గా గుండెనొప్పులు రావడానికి కరోనరి ఆర్టరీలలో ఏర్పడే అడ్డంకులు, అధిక కొవ్వు, రక్తం గడ్డకట్టడం వంటివే ప్రధాన కారణమని బెంగళూరు ఆస్టర్ ఆర్వీ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్యామ్ సుందర్ కె ఆర్ స్పష్టం చేశారు. అధిక బీపీ, మధుమేహం, ఊబకాయం, పొగత్రాగడం వంటివి గుండె సమస్యలను తెచ్చిపెడతాయని ఆయన హెచ్చరించారు. కష్టమైన వర్కౌట్లు చేసే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, నిపుణుల సలహాలతో క్రమంగా వ్యాయామం పెంచాలని ఆయన సూచించారు.