కార్పొరేట్ ఉద్యోగులకు భారీ షాక్: అత్యుత్తమ ప్రతిభ కనబరిచినా లేఆఫ్స్ తప్పవా

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు సమయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వారికి కూడా రక్షణ ఉండదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోందని టెక్కీలు వాపోతున్నారు. వ్యాపార అవసరాలు, బడ్జెట్ కోతల కారణంగానే యాజమాన్యాలు లేఆఫ్స్ నిర్ణయాలు తీసుకుంటున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం తక్కువ పనితీరు కనబరిచేవారే కాకుండా, ఎక్కువ వేతనాలు అందుకునే ప్రతిభావంతులు సైతం ఈ కోతలకు బలవుతున్నారని పలువురు మేనేజర్లు వెల్లడించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.