బ్రిక్స్ వేదికగా గ్లోబల్ సౌత్ దేశాల సహకారానికి భారత్ నాయకత్వం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అనకాపల్లి
బ్రిక్స్ భాగస్వామ్య దేశాల ద్వారా గ్లోబల్ సౌత్ సహకారంలో భారత్ కీలక పాత్ర పోషించడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని ట్రినిడాడ్ అండ్ టొబాగో రాయబారి స్పష్టం చేసినట్లు అనకాపల్లి ఎంపీ డాక్టర్ సిఎం రమేష్ వెల్లడించారు. ఈ మేరకు నామో యాప్ ద్వారా ఆయన సోషల్ మీడియాలో వివరాలను పంచుకున్నారు. అదేవిధంగా ఈ ఏడాది వస్తువులు మరియు సేవల రంగంలో ఒక ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు.