జూరాల ఆయకట్టు ఎండితే రేవంత్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం అంటూ కేటీఆర్ హెచ్చరిక
రిపోర్టర్: విజయ్
స్థలం: పెబ్బేరు
పెబ్బేరు చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. జూరాల ఆయకట్టు కింద ఒక్క ఎకరం ఎండినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పెబ్బేరు పట్టణ సబ్‌స్టేషన్ నుంచి సుభాష్ చౌరస్తా వరకు రైతులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.