షాకింగ్ ఘటన: ఆరవ అంతస్తు నుంచి పసిపాపను కిందకు తోసేసిన బాలిక
రిపోర్టర్: మహేష్
స్థలం: Mumbai
ముంబైలోని గోరెగావ్ హౌసింగ్ సొసైటీలో పద్దెనిమిది నెలల పసిపాప మృతి చెందిన ఘటనలో సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు డిసిపి గజానన్ రాజ్మానే తెలిపారు. ఆరో అంతస్తు నుంచి పదేళ్ల బాలిక చిన్నారిని మెట్ల డక్ట్ లోకి తోసేసినట్లు గుర్తించామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.