విద్యుత్ కోతలపై రావిచెడులో బీఆర్ఎస్ నేతల నిరసన ధర్నా
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రావిచెడు
రంగారెడ్డి జిల్లా రావిచెడు గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్ ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతులకు విద్యుత్ కోతలు పెరగడంతో రైతాంగం తీవ్ర సంక్షోభానికి గురవుతోందని ఆరోపించారు. పంటలు ఎండిపోతున్నా రేవంత్ రెడ్డి సర్కార్ కు పట్టింపు లేదని విమర్శించారు. మాజీ శాసనసభ సభ్యులు జైపాల్ యాదవ్ తో కలిసి కడ్తాల్ మండల రైతులు రోడ్డుపై బైఠాయించి ఈ ధర్నా నిర్వహించారు.