ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలు: మేనిఫెస్టో విడుదల చేసిన ఎన్ఎస్ఈఐ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New Delhi
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల కోసం ఎన్ఎస్ఈఐ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. విద్యార్థులకు సరసమైన ధరల్లో వసతి, నెలసరి సెలవులు, మెట్రో రాయితీ పాస్లు, 24 గంటల లైబ్రరీలు, సబ్సిడీ క్యాంటీన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. విద్యార్థుల సంక్షేమమే తమ ప్రధాన అజెండా అని జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖర్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 18న పోలింగ్ జరగనుంది.